: హలాల్ చేసిన బీఫ్ తినడానికి నేను ఇష్టపడతా: ఒవైసీ


ప్రజలు బీఫ్ తినే విషయంపై ప్రభుత్వాలకు ఏం పని? అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. హలాల్ చేసిన బీఫ్ ను తినడానికి తాను ఇష్టపడతానని చెప్పారు. తమ అభిరుచి మేరకు ఆహారం తీసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు. సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని ఆలపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఇండియా టుడే దక్షిణాది సదస్సు - 2017 సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం యువతలో అతివాద భావజాలం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని ఒవైసీ అన్నారు. హిందువులు చాలా వరకు సెక్యులర్ గా ఉంటారని... కానీ, బాగా మాట్లాడే ఓ వ్యక్తి హిందువులను తనవైపు తిప్పుకున్నారని చెప్పారు. దీనికి కారణం బీజేపీని అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్సే అని తెలిపారు. హిందుత్వను ఓ జీవన విధానంగా సుప్రీంకోర్టు గుర్తించిందని... అలాంటప్పుడు ఇస్లాం, క్రైస్తవం కూడా చాలా మందికి జీవన విధానాలే అని అన్నారు. 

  • Loading...

More Telugu News