: కళ్లు దానం చేసిన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్


ఇండియన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నేత్రాలను దానం చేశాడు. చెన్నైలోని రాజన్ నేత్ర చికిత్సాలయంలో నేత్రదానంపై అవగాహన ప్రచార సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అశ్విన్... తన నేత్రాలను దానం చేస్తున్నట్టు అంగీకార పత్రంపై సంతకం చేశాడు. ఈ కార్యక్రమంలో రాజన్ నేత్ర చికిత్సాలయం ఛైర్మన్ డాక్టర్ మోహన్ రాజన్, తమిళ సినీ హాస్యనటుడు వైజీ మహేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ, నేత్రదానం చేయాలంటూ తన భార్య ప్రీతి ఎప్పటి నుంచో చెబుతోందని... ఇన్నాళ్లకు ఆమె కోరికను నెరవేర్చానని చెప్పాడు. నేత్రదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News