: పవన్ రారని అల్లు అరవింద్ చెప్పినా, తమ ప్రయత్నం మానని రాంచరణ్, సురేఖ!


"చిరంజీవి 150వ చిత్రానికి పవన్ కల్యాణ్ రావడం లేదు"... ఇది అల్లు అరవింద్ చెప్పిన విషయం. "పవన్ కల్యాణ్ ను తీసుకు వచ్చేందుకు స్వయంగా చిరంజీవి సతీమణి సురేఖ వెళ్లనుంది"... ఇది నిన్న వచ్చిన వార్త. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని హాయ్ ల్యాండ్ లో జరిగే చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ వస్తాడా? రాడా? ఈ విషయంలో ఇప్పటివరకూ సమాచారం లేనప్పటికీ, ఇంతటి ప్రతిష్ఠాత్మక సినిమా ఫంక్షన్ కు పవన్ రావాల్సిందేనని, ఆయన రాకుంటే పెను లోటేనన్నది అభిమానుల వాదన.

ఇక పవన్ ను తీసుకు వచ్చేందుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. మరోవైపు చిరు భార్య సురేఖ స్వయంగా పవన్ వద్దకు వెళ్లి ఆయన్ను ఫంక్షన్ కు పిలవనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ పవన్ రాకుంటే, అభిమానులు చేసే నినాదాలను అదుపు చేయలేమని మెగా ఫ్యామిలీ భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన్ను తీసుకురావాలని పలువురు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ వేడుకకు తాను రానవసరం లేదని పవన్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News