ఇక మొబైల్ సాయంతో కొన్ని నిమిషాల్లోనే వెబ్సైట్ రూపొందించుకోవచ్చు!: న్యూఢిల్లీలో గూగుల్ సీఈవో
చిరువ్యాపారులు కేవలం మొబైల్ సాయంతో కొన్ని నిమిషాల్లోనే వెబ్సైట్ రూపొందించుకోవచ్చని చెప్పారు. ఈ యాప్‌ను భారత్‌లో విడుదల చేస్తే ఇక ప్రపంచంలో ఎక్కడైనా విడుదల చేయవచ్చని తాము తెలుసుకున్నట్లు వ్యాఖ్యానించారు.ఈ యాప్‌తోపాటు తమ సంస్థ ఫిక్కీ, ఐఎస్బీతో కలిసి డిజిటల్ అన్లాక్డ్ పేరుతో ఒక విద్యా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో వ్యాపారాలకు ఉపయోగపడే ఆన్లైన్ కోర్సులు ఉంటాయని ఆయన అన్నారు. గూగుల్ ఇండియా, దక్షిణాసియా విభాగాధిపతి రాజన్ ఆనంద్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ... ఎస్ఎంబీలు మొదటి నుంచి తమ ప్లాట్‌ఫామ్‌కు ప్రధానమైన యూజర్లుగా ఉన్నారని చెప్పారు.