: నేటి నుంచి కార్యకర్తలతో శశికళ ఆరు రోజుల సమావేశాలు... ప్రతి జిల్లాలోనూ పట్టు కోసమే!


అన్నాడీఎంకే పార్టీలో తనకు తిరుగులేకుండా చూసుకునేందుకు జయలలిత నెచ్చెలి శశికళ కీలకమైన అడుగు వేశారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంత్రివర్గ సహచరులతో సమావేశమైన వేళ, పార్టీ కార్యదర్శి స్థాయిలో జిల్లా కార్యకర్తల సమావేశాలను ఆమె ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనుండగా, తొలి రోజు ఐదు జిల్లాల కార్యకర్తలు హాజరయ్యారు. మిగతా ఐదు రోజుల్లో అన్ని జిల్లాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వివిధ విభాగాల్లోని అందరితో ఆమె సమావేశం కానున్నారు.

పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షల కోసమే ఈ సమావేశాలని బయటకు చెబుతున్నప్పటికీ, శశికళ, తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ సమావేశాలను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. రాష్ట్రానికి సీఎంగా ఆమె అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయవచ్చని వార్తలు వస్తున్న వేళ, జిల్లా స్థాయిలో కార్యకర్తలను, పార్టీ కేడర్ ను తన వశం చేసుకునేందుకే ఆమె ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News