: కేవీపీ ఇంటర్నేషనల్ క్రిమినల్... పోలవరంపై మాట్లాడే హక్కు ఆయనకు లేదు: దేవినేని
కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంటర్నేషనల్ క్రిమినల్ అని ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేవీపీ రామచంద్రరావుకి పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత లేదని, కేవీపీ అవినీతి చిట్టాను బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు. కేవీపీ ఢిల్లీకి మూటలు మోసారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కేవీపీ మతి భ్రమించి ఉత్తరాలు రాస్తున్నారని అన్నారు. 'ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో' అని ఆయన ఎద్దేవా చేశారు. 'మూటలు మోసే నువ్వు కూడా మాట్లాడేవాడివేనా?' అని ఆయన ప్రశ్నించారు. 'ఇంటర్నేషనల్ క్రిమినల్.. ఖబడ్దార్' అంటూ దేవినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.