: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న కాల్పులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. బారాముల్లాలో సైనికులపైకి కాల్పులు జరిపారు. దీంతో సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఉగ్రవాది దాక్కున్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.