: బెజవాడ సితార సెంటర్లో పక్కింటిపై కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
కృష్ణా జిల్లా విజయవాడలోని సితార సెంటర్లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. సితార సెంటర్ కు కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో రెండో అంతస్తు నిర్మిస్తుండగా, పక్కనే ఉన్న మరో భవనంమీదకు అది కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డట్టు సమాచారం. పెద్ద శబ్దంతో భవనం కూలగానే స్థానికులు ఆందోళన చెందారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న అధికారులు, నాయకులు ఘటనపై ఆరాతీస్తున్నారు.