: ఎవరు చెప్పినా వినే అలవాటు జగన్ కు లేదు: భూమా నాగిరెడ్డి


వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ వ్యవహారశైలి అంతా ఏకపక్షంగానే ఉంటుందని... ఎవరు ఏది చెప్పినా వినే అలవాటు ఆయనకు లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల కలిగిన నాయకుడని... ఆయన నేతృత్వంలోనే రాష్ట్రాభివృద్ది సాధ్యపడుతుందని చెప్పారు. చంద్రబాబు పట్టుదలను చూసే తాను టీడీపీలో చేరానని అన్నారు. మండలి ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ, ముచ్చుమర్రి లిఫ్ట్ శంకుస్థాపన జరిగినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ సాధ్యమా? అని అనుమానపడ్డానని... కానీ, చంద్రబాబు పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేశారని ప్రశంసించారు. 

  • Loading...

More Telugu News