: మంత్రి గంటాపై మండిపడ్డ సీపీఎం నేత మధు


ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై సీపీఎం నేత మధు మండిపడ్డారు. తక్కువ విలువ చేసే ఆస్తులను హామీగా పెట్టి, ఎక్కువ రుణం తీసుకుని బ్యాంకును మోసం చేశారని విమర్శించారు. గంటా వ్యవహారంపై సీఎం చంద్రబాబు మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం చట్ట విరుద్ధంగా భూ సేకరణ చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడితే ఢిల్లీ నుంచి పార్లమెంటరీ బృందాన్ని పిలుస్తామని, నష్టపరిహారం లేకుండా పరిశ్రమలు స్థాపిస్తే భౌతికంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా  హెచ్చరించారు. పాతనోట్ల గడువు ముగిసినందున కరెన్సీ ఆంక్షలు ఎత్తివేయాలని మధు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News