మీరు త్వరలోనే పూర్తిగా కోలుకోవాలి... సుష్మా స్వరాజ్‌కు పాకిస్థాన్‌ ప్రధాని లేఖ!

భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యులు ఇటీవలే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే కోలుకొని, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ ఆమెకు లేఖ రాశారు. ప‌దిరోజుల క్రితం సుష్మాస్వ‌రాజ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె త‌న‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన‌లేక‌పోతున్న‌ప్ప‌టికీ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ అవసరమైన వారికి సాయం చేస్తున్నారు.
Go Back to Shorts
sushma swaraj
pak pm

More Telugu News