: బీఎండబ్ల్యూ భారం దించుకున్న ఒలింపియన్ దీపా కర్మాకర్


రియో ఒలింపిక్స్ లో భారత్ తరపున జిమ్నాస్టిక్స్ లో పాల్గొని అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు చూరగొన్న దీపా కర్మాకర్ బీఎండబ్ల్యూ భారం దించేసుకుంది. జిమ్నాస్టిక్స్ లో అత్యంత ప్రమాదకరమైన ప్రొడునొవా విభాగంలో విశేషమైన ప్రచారం తెచ్చిన దీప ప్రతిభకు ముగ్ధుడైన టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రోత్సాహకంగా బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేశాడు. అయితే ఆమె స్వస్థలం అగర్తలాలో తన ఇంటికి గతుకుల రోడ్లకు ఆ కారు సరిపోదని, దానికి తోడు సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో లేదని బహుమతి అందుకున్న కొన్నాళ్లకే కారు రిటర్న్ తీసుకోవాలని కోరింది.

దీంతో ఆమె స్వస్థలంలోని పొలిటీషియన్స్ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేవని చెప్పాలనుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు. వెంటనే ఆమె ఉంటున్న ప్రాంతానికి రోడ్డు వేయించారు. అయినప్పటికీ దానిని మెయింటైన్ చేసే స్తోమత తనకు లేదని చెబుతూ ఆమె దానిని వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఆమెకు వారు 25 లక్షల రూపాయలు అందజేశారని, ఆ డబ్బుతో తమ ప్రాంతానికి సరిపడే కారును ఆమె కొనుక్కుందని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. ఆ కారుకు తమ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా ఉందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News