: సమావేశానికి రాని సీఎంలకు చంద్రబాబు చేసిన సూచనలివి!


డిజిటల్ లావాదేవీలపై తన అధ్యక్షతన ఏర్పాటైన ఉపసంఘం సమావేశానికి రాని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో మాట్లాడిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. డిజిటల్ లావాదేవీలను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని, ఇందుకోసం ప్రతి గ్రామానా అవగాహనా శిబిరాలు నిర్వహించాలని ఆయన సూచించారు. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, కనెక్టివిటీ, ఫిన్ టెక్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు.

ఇదే సమయంలో ప్రజల ఖాతాల భద్రత అత్యంత ప్రాధాన్యతా పూర్వక అంశమని గుర్తు చేసిన ఆయన, సైబర్ భద్రతపై దృష్టిని కేంద్రీకరించారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ దిశగా కేంద్రం ముందడుగు వేస్తోందని, ప్రతి భారతీయుడూ డిజిటల్ ఇండియా దిశగా ముందుకు సాగేందుకు కార్యాచరణ రూపొందించాలని, అందుకోసం నీతి ఆయోగ్, ఆర్థిక, సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా నగదు రహిత లావాదేవీలపై వారి అభిప్రాయాలను కూడా బాబు అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News