: మరో భారీ అవినీతి చేప.. తిరుపతిలోని ఎంసీఐ అధికారి గుణశేఖర్‌యాదవ్ ఇంట్లో భారీగా నగదు, బంగారం
ఆదాయపన్నుశాఖ అధికారుల వలలో మరో భారీ అవినీతి చేప పడింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అధికారులు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమలావాదేవీలపై నిఘా పెట్టి సోదాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధికారి గుణశేఖర్‌యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు ఈ రోజు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని భవానీనగర్‌లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తోన్న అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో గుణశేఖర్ భార్య శ్రీలక్ష్మి బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.