: పారిశ్రామికవేత్తతో పెళ్లిపై హీరోయిన్ అనుష్క స్పందన


దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క గురించి ఈ మధ్య కాలంలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే అనుష్క పెళ్లి చేసుకుందని కొన్నిసార్లు, ఓ పారిశ్రామికవేత్తతో రహస్యంగా ఎంగేజ్ మెంట్ జరిగిందని మరికొన్ని సార్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అనుష్క... తనకు పెళ్లి వయసు వచ్చేసిందని... కానీ, పెళ్లి చేసుకోవడానికి సరైన వరుడు మాత్రం ఇంతవరకు దొరకలేదని చెప్పింది. తనపై వస్తున్న వార్తలను విని నవ్వుకున్నానని తెలిపింది. పెళ్లి అనేది మన చేతుల్లో లేదని... పెళ్లి ఘడియలు వచ్చినప్పుడు అది ఆగదని... తనకు ఇంకా ఆ ఘడియలు వచ్చినట్టు లేవని చెప్పింది అనుష్క. ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News