: అమ్మా! నీ పేరు నిలబెడతాను... ప్రతి తెలుగు వాడు గర్వపడే సినిమా తీశాను: క్రిష్
'అమ్మా! నా పేరు ముందు నీ పేరు వేశాను... నీ పేరు నిలబెడతాను' అంటూ దర్శకుడు క్రిష్ తన కన్నతల్లికి ప్రమాణం చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో మాట్లాడుతూ, పెళ్లైన తరువాత పట్టుమని పదిరోజులు కూడా భార్య రమ్యతో గడపలేదని, గర్వపడే సినిమా తీశానని అన్నాడు. శాతకర్ణి శాసనాలు లండన్ లో ఉన్నాయని, వాటిని సీఎం చంద్రబాబు తెస్తానన్నారని అన్నారు. మన చరిత్రను ఎవరో పూజిస్తున్నా... మనకి మాత్రం చేతకావడం లేదని ఆయన అన్నారు.
మరాఠాలు, తమిళలు, గ్రీకులు పూజిస్తున్నారని, కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనదగ్గర ఆయనకు సంబంధించిన ఎలాంటి చరిత్ర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో గౌతమీపుత్రి శాతకర్ణి అమరావతిని రాజధానిని చేసుకుని పాలించడమేంటి? ఇప్పుడు అదే అమరావతిని రాజధానిని చేయడమేంటని ఆయన అన్నారు. కోటి లింగాల నుంచి ఆరంభమైన గౌతమీపుత్ర శాతకర్ణి కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు దేశాన్ని పాలించాడని అన్నారు. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా తీశానని క్రిష్ చెప్పాడు. ఈ కథను బాలయ్య అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.