: మా ఇద్దరమ్మాయిలకీ సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది: జీవిత
సినిమాల్లో నటించాలనే కోరిక తమ ఇద్దరు అమ్మాయిలకూ ఉందని ప్రముఖ నటి జీవిత తెలిపారు. తమ పెద్ద అమ్మాయి శివాని మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతోందని... రెండో అమ్మాయి శివాత్మిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోందని ఆమె తెలిపారు. తన పిల్లలను బాగా చదివించాలనే కోరికతో చదివిస్తున్నానని చెప్పారు.
ప్రస్తుతం సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని... ఒకప్పుడు హీరోతో 'ఐ లవ్ యూ' అనే డైలాగ్ చెప్పడానికే ముందూ వెనుకా ఆలోచించేవారని జీవిత అన్నారు. అప్పటి సినిమాల్లో హీరోయిన్, వ్యాంప్ లు ఉండేవారని... రెండు పాత్రల మధ్య తేడా ఉండేదని... అచ్చమైన తెలుగు ఆడపడుచుల్లా కనిపించే హీరోయిన్లను అందరూ అభిమానించేవారని చెప్పారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాంపులు ఎందుకు... అంతే మేమే చేసేస్తాం అనే విధంగా హీరోయిన్లు తయారైపోయారని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు.