: ఒక్క‌రిని కాదు.. ప్ర‌తి హిందువు ప‌దిమందిని క‌నండి.. వారి సంగ‌తి దేవుడు చూసుకుంటాడు.. వాసు దేవానంద స‌రస్వ‌తి పిలుపు

ప్ర‌తి హిందువు ప‌ది మంది పిల్ల‌ల్ని కనాల‌ని, వారి భారాన్ని దేవుడే మోస్తాడ‌ని హిందూ ఆధ్యాత్మిక వేత్త వాసు దేవానంద స‌ర‌స్వ‌తి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్‌లో ధ‌ర్మ సంస్కృతి మ‌హాకుంభ పేరిట జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి ఇంకా చాలామంది హిందువులు కావాల‌ని అన్నారు. 'హిందువుల‌ను ర‌క్షించండి' అనే నినాదంతో అక్కడికి వ‌చ్చిన స్వామీజీలంద‌రూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశంలో ప్ర‌స్తుతం ఉన్న హిందూ జ‌నాభా రెట్టింపు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి వ‌క్కాణించారు.  ఈ సంద‌ర్భంగా వాసుదేవానంద స‌రస్వ‌తి మాట్లాడుతూ ఒక‌రిద్దరు పిల్ల‌ల్ని మాత్ర‌మే క‌నాల‌నే ఆలోచ‌న‌ను, నిబంధ‌న‌ను ప‌క్క‌న ప‌డేయాల‌ని సూచించారు. 'ఒక్కొక్క‌రు ప‌దిమందిని క‌నండి. వారి భారం సంగ‌తి దేవుడే చూసుకుంటాడు' అని పేర్కొన్నారు.

More Telugu News