: తైమూరుతో ఫొటోకు పోజిచ్చిన కరీనా దంపతులు


బాలీవుడ్ ప్రముఖ నటి కరీనాకపూర్ మగబిడ్డను ప్రసవించిన విషయం తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం ప్రసవించిన కరీనా, బిడ్డ తైమూరుతో సహా ఈరోజు ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులు తమ బిడ్డతో ఫొటోకి పోజు ఇచ్చారు. తమ ఇంటి ఆవరణలో దిగిన ఈ ఫొటోల్లో బిడ్డను ఎత్తుకున్న సైఫ్, పక్కనే నిలబడ్డ కరీనాలు అభివాదం చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.
 

  • Loading...

More Telugu News