: 'నా బాడీ చూస్తే నాకు వాంతి వచ్చేస్తుంది' అంటున్న ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్


కండలు తిరిగిన శరీరంతో ఉన్న అతని ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జిమ్ లలో ఉంటాయి. కేవలం ఆయను స్పూర్తిగా తీసుకుని ఒక తరం మొత్తం కండలు పెంచిందంటే అతిశయోక్తి కాదు. 1970లలో ప్రపంచాన్ని ఊపేసిన ఆ కండల వీరుడు, ఇప్పటికీ తన ఫేమ్ కోల్పోలేదు. అతనే హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్. అలాంటి ష్క్వార్జ్ నెగ్గర్ తన బాడీని చూస్తే తనకు వాంతి వస్తుందని పేర్కొన్నాడు. స్వతహాగా తనను తాను విమర్శించుకుంటానని ఆయన చెప్పారు. అద్దంలో తనను తాను చూసుకుంటే నచ్చనని ఆయన అన్నారు. 'మిస్టర్ ఒలింపియా'గా గెలిచిన ప్రతిసారీ తన బాడీ పెద్ద బాగా లేకున్నా తనను విజేతగా ఎందుకు చేశారా? అని ఆలోచించేవాడినని ఆయన అన్నారు. ఎందుకంటే ఎంత సాధించినా మనలో ఏదో ఒక వెలితి ఉండిపోతుందని ఆయన చెప్పారు.

కాగా, 1970 నుంచి ఎనిమిదేళ్లు ఆయనే వరల్డ్ బెస్ట్ ఫిట్ నెస్ ఒలింపియాగా గెలిచారు. దీంతో ఆయన పేరు మార్మోగిపోయింది. తరువాత కానన్ సిరీస్ సినిమాలతో ఆయన హాలీవుడ్ హీరోగా మారారు. 'కానన్' సిరీస్, 'టెర్మినేటర్' సిరీస్, 'కమాండో' వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు తన వయసు గురించిన ఆందోళన లేదని, 20 ఏళ్ల క్రితం ఏ పనులైతే చేయగలిగానో ఆ పనులు ఇప్పుడు కూడా చేయగలనని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News