: పాపినేని శివశంకర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు


గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి పాపినేని శివశంకర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పాపినేని ‘రజనీగంధ’ కవితా సంపుటికిగాను ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు పేర్కొంది. ఈ అవార్డును ఫిబ్రవరిలో ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. కాగా, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కల్లు పాపినేని శివశంకర్ స్వగ్రామం.

  • Loading...

More Telugu News