: రాజమౌళికి ఇచ్చిన ఆ ఒక్క ప్రామిస్ మాత్రం నిలబెట్టుకో: రామ్ గోపాల్ వర్మకు నాగార్జున సలహా
'బాహుబలి' సృష్టికర్త రాజమౌళికి ఇచ్చిన ఆ ఒక్క ప్రామిస్ నూ నిలబెట్టుకోవాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నాగార్జున సలహా ఇచ్చాడు. "రాజమౌళి గారికి ఇచ్చిన ఆ ఒక్క ప్రామిస్ మాత్రం గుర్తు పెట్టుకో. ఎవ్రీ ఫిలిం యూ మేక్ ఫ్రం నౌ ఆన్ షుడ్ మేక్ ఏ డిఫరెన్స్. దట్ ఐ వాంట్ యూ టూ డూ. (ఇక నుంచి నువ్వు తీసే ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను)" అన్నాడు.
దీనిపై స్పందించిన వర్మ, నాగార్జున వ్యాఖ్యలకు ఒక చిన్న సవరణ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఇందాక రాజమౌళి మీద ఒట్టు వేశాను. ఇప్పుడు నాగార్జున మీద కూడా ఒట్టు వేస్తున్నాను. రాజమౌళి మీద ఉత్తుత్తి ఒట్టు వేశానని భవిష్యత్తులో తాను చెప్పుకునే అవకాశం లేకుండా చూసుకునేందుకే నాగార్జున మీద కూడా ఒట్టు పెడుతున్నట్టు చెప్పాడు. ఇకపై వైవిధ్య భరిత చిత్రాలే తీస్తానని అన్నాడు.