: ర్యాష్ డ్రైవింగ్... ప్రాణం కోల్పోయిన ఒక విద్యార్థి
హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మరో యాక్సిడెంట్ జరిగింది. బషీర్ బాగ్ లోని ఓ హోటల్ లో స్నేహితులతో పార్టీ చేసుకున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ముగ్గురు విద్యార్థినిలు కారులో బయలుదేరారు. విశాల్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ అదుపుతప్పాడు... దీంతో కారు నెక్లెస్ రోడ్డులో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ హాస్య అనే బీటెక్ స్టూడెంట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు విశాల్ ను అదుపులోకి తీసుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.