: కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచురీ ... కొత్త రికార్డు!


టీమిండియాతో పాటు, కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఘటన చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో చోటుచేసుకుంది. నాయర్ 303 పరుగులు చేసి ట్రిపుల్ సెంచురీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు 477 పరుగులకు ఆలౌట్ అవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్ కేెఎల్ రాహుల్ (199) ధాటిగా ఆడి టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు.

అనంతరం కరుణ్ నాయర్ (379 బంతుల్లో 31 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో  303 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (67), రవీంద్ర జడేజా (51)ల సహకారంతో మరింత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఈ క్రమంలో కెరీర్ లో తొలి సెంచురీ నమోదు చేసిన నాయర్ డబుల్ సెంచరీతో పాటు ట్రిపుల్ సెంచరీ కూడా సాధించి సత్తాచాటాడు. అలాగే, టెస్టుల్లో టీమిండియా అత్యధిక పరుగులు సాధించింది. 190.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 756 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 

  • Loading...

More Telugu News