Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్టీ అధికారాన్ని లాక్కునే వ్య‌క్తిలా శ‌శిక‌ళ క‌నిపించ‌డం లేదు: విజ‌య‌శాంతి

అన్నాడీఎంకే నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌యిన‌ శ‌శిక‌ళ పుష్ప జ‌య‌ల‌లితకు అత్యంత స‌న్నిహితురాలైన శ‌శిక‌ళ‌పై ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించిన అంశంపై విజ‌య‌శాంతి స్పందించారు. ఆస్తులు లాక్కోవ‌డానికి శ‌శిక‌ళ వ‌చ్చిందంటూ ఆమెపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ఆమె కొట్టివేశారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని లాక్కునే వ్య‌క్తిలా కూడా శ‌శిక‌ళ క‌నిపించ‌డం లేదని విజ‌య‌శాంతి అన్నారు.
తాను శశిక‌ళ‌ను క‌లిశాన‌ని,  ఆమె చాలా బాధ‌ప‌డుతూ ఉన్న‌ట్లు అనిపించిందని, బ‌య‌ట‌ మాట్లాడుకుంటున్న‌ట్లు ఆ ఉద్దేశం ఆమెలో ఉన్న‌ట్లు త‌న‌కు అనిపించ‌లేదని అన్నారు. శ‌శిక‌ళ‌పై జ‌య‌ల‌లిత అసంతృప్తితో వుండి ఉంటే కనుక ఆమెను దూరంగానే ఉంచేదని అభిప్రాయపడ్డారు. శ‌శిక‌ళ‌పై పలువురు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయాల్లో సాధార‌ణ‌మే అని ఆమె అన్నారు.
vijaya shanthi

More Telugu News