: 'శాతకర్ణి' బరిలోకి దిగితే వార్ వన్ సైడే... మెగాస్టార్ కూడా ఇలాంటి సినిమాలు చేయాలి: వర్మ

బాలకృష్ణ తాజా సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'ని మెచ్చుకున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... మెగాస్టార్ పై మాత్రం మరోసారి సెటైర్ వేశాడు. గౌతమిపుత్ర బరిలోకి దిగితే వార్ వన్ సైడే అని వర్మ ట్వీట్ చేశాడు. సంక్రాంతికి పోటీ ఉండే ప్రసక్తే లేదని చెప్పాడు.  బాలయ్య సినిమాతో పాటు చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే వర్మ తొలి ట్వీట్ చేశాడు.

కత్తి కంటే కూడా షార్ప్ ట్రైలర్ 'శాతకర్ణిదే' అంటూ సెకండ్ ట్వీట్ చేశాడు. చిరంజీవి 150వ చిత్రం తమిళ సినిమా 'కత్తి' రీమేక్ అన్న విషయం తెలిసిందే. 'గౌతమిపుత్ర'లాంటి సినిమా చేసి, తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఒక మెగా అభిమానిగా చిరంజీవిని కోరుతున్నానని మరో ట్వీట్ చేశాడు. అంతేకాదు, మీరు నిజంగా మెగా అభిమానులే అయితే 'బాహుబలి', 'శాతకర్ణి' లాంటి సినిమాలను చేయాలని మెగాస్టార్ కు చెప్పాలంటూ చిరంజీవి ఫ్యాన్స్ కు కూడా సూచించాడు. 

More Telugu News