: లోకేష్ కాన్వాయ్ లో అపశ్రుతి... పల్టీలు కొట్టిన ఎమ్మెల్సీ కారు.. తీవ్ర గాయాలు!


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం శివారులోని బొమ్మూరు సమీపంలో కాన్వాయ్ లోని కారు బోల్తాపడి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వేమగిరి వద్ద డివైడర్ ను ఢీకొనడంతో, కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావుతో పాటు కారు డ్రైవర్, గన్ మెన్ లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News