తనకు సూపర్ ఉమన్ అనిపించుకోవాలని లేదంటున్న బాలీవుడ్ హీరోయిన్
షూటింగ్ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, అదే సమయంలో ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే దానికి అటెండ్ కాలేకపోతే గిల్టీగా ఉంటుందని చెప్పింది. తాను మహిళను కావడం వల్లే అలా అనిపిస్తుందని చెప్పింది. మనసమాజంలో మహిళల ఆలోచనా ధోరణి అలాగే ఉందేమో అనిపిస్తుందని, కొన్నిసార్లు ఇల్లు, ఉద్యోగం ఒకేసారి చక్కదిద్దడం కుదరదని, అలాంటప్పుడు రెండూ చక్కదిద్దాలన్న ఆలోచన సరికాదని చెప్పింది. తనకు సినిమాలు చేయడం ఇష్టం కనుక ఎంతసేపు పని చేసినా కష్టం అనిపించదని తెలిపింది.