: అమల్లోకి పెట్రోలు డిస్కౌంట్.. డిజిటల్ చెల్లింపులపై కేంద్రం నజరానా!


డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోలు, డీజిల్  కొనుగోలు చేసేవారికి 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఇంధనం కొనుగోలుతోపాటు బీమా, పాలసీలు, రైలు టికెట్లు, టోల్ చార్జీలను డిజిటల్ రూపంలో చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిగిన మూడు రోజుల్లో రాయితీ మొత్తాన్ని వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. క్రెడిట్, డెబిట్, ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పీఎస్‌యూ (ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) బంకుల్లో చేసిన కొనుగోళ్లకు రాయితీ వర్తిస్తుందని వివరించింది. దీని ప్రకారం లీటరు పెట్రోలుపై 49 పైసలు, లీటరు డీజిల్‌పై 41 పైసలు రాయితీ రూపంలో తిరిగి వినియోగదారుడి ఖాతాలోకి చేరుతుంది.

  • Loading...

More Telugu News