: 400 పరుగుల భారీ స్కోరుతో సవాల్ విసిరిన ఇంగ్లండ్!


ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 400 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లిష్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి రోజు జెన్నింగ్స్ (112) సెంచరీతో రాణించగా, మొయిన్ అలీ (50), కెప్టెన్ కుక్ (46) ఆకట్టుకున్నారు. రెండో రోజు జోస్ బట్లర్ (76) వన్డే తరహా ఆటతీరుతో అర్ధసెంచరీ సాధించగా, అతనికి స్టోక్స్ (31) బాల్ (31) చక్కని సహకారమందించారు. ఇతర ఆటగాళ్లంతా డబుల్ డిజిట్ స్కోరు సాధించగా, కేవలం రషీద్ (4) మాత్రమే విఫలమయ్యాడు. చివర్లో ఆండర్సన్ రాగానే బట్లర్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 130.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు సరిగ్గా 400 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి రాణించగా, 4 వికెట్లు తీసి జడేజా ఆకట్టుకున్నాడు. అనంతరం మురళీ విజయ్, కేఎల్ రాహుల్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.

  • Loading...

More Telugu News