: ఇప్పుడు శశికళ వంతు.. ఆమెను కలిసేందుకు క్యూకట్టిన ముఖ్యమంత్రి, మంత్రులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళనాడులో కొత్త అధికార కేంద్రం ఏర్పడింది. ‘అమ్మ’ అధికారిక నివాసమైన పోయెస్ గార్డెన్‌కు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రుల క్యూకడుతున్నారు. జయ స్థానంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ‘చిన్నమ్మ’(శశికళ) కరుణా కటాక్షాల కోసం వేచి చూస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం, కె.పళనిస్వామి, సి.శ్రీనివాసన్, పి.తంగమణి, ఎస్పీ వేలుమణి తదితర మంత్రులు శశికళను కలిసేందుకు జయ నివాసం 'వేదనిలయం' వద్దకు చేరుకున్నారు. అలాగే మరికొందరు మంత్రులు కూడా శశికళ దర్శనం కోసం వచ్చారు. పార్టీలో, ప్రభుత్వంలో శశికళ కీలకం కాబోతున్నారన్న వార్తతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే మంత్రులు ఇలా క్యూకడుతున్నట్టు తెలుస్తోంది.