: ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ను ఆవిష్కరించిన చంద్రబాబునాయుడు
ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ఆన్ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని అన్నారు. వాటిలో దేన్నైనా ఎంచుకుని సేవలు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ప్రారంభించామని, దీంతో బ్యాంకు సేవలన్నీ వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీని ద్వారా నగదు బదిలీ కూడా చేసుకోవచ్చని, అయితే పెద్ద మొత్తం ఒకేసారి కాకుండా, విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.