: రాజాజీహాల్ గేట్ వద్ద తోపులాట.. లాఠీఛార్జ్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూడడానికి రాజాజీహాల్‌కు పెద్ద ఎత్తున ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంగణంలో పలుసార్లు ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. కొద్ది సేపటి క్రితం రాజాజీహాల్ గేట్ వద్ద పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. జయలలిత అంత్యక్రియలు జరపడానికి మరో రెండు గంటల సమయమే ఉన్న నేపథ్యంలో ఆమెను చివరిసారిగా చూడాలని ఆమె అభిమానులు తొందరపడుతున్నారు. దీంతో రాజాజీహాల్ గేట్ వద్ద ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకొని వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరగకుండా పోలీసులు వారిపై లాఠీ ఝళిపించారు. పలువురు యువకులకు గాయాలయ్యాయి.