: తమిళనాడు గవర్నర్ కు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశారు. ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వాకబు చేసిన వెంకయ్యనాయుడు, చెన్నైకు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు.