: మరో అద్భుతం జరుగుతుందో... జరగదో!: జయలలితపై సుబ్రహ్మణ్య స్వామి


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతో గుండె నిబ్బరమున్న మహిళని కొనియాడిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మరో అద్భుతం జరిగి ఆమె తిరిగి ప్రజల ముందుకు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన "జయలలితకు గుండెపోటు వచ్చిందని విని కలత చెందాను. ఆమె మానసికంగా దృఢమైన వ్యక్తి. మరో అద్భుతం జరిగిందని, ఆమె కోలుకుందని ఈ మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్లు చెబుతారని ఆశిస్తున్నాను. ఆ అద్భుతం జరిగిందో... జరగలేదో మరి కాసేపట్లో తెలుస్తుంది" అని అన్నారు. ఆమె కోలుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News