: ముద్రగడ తీరు సరికాదు... తరువాతి పరిణామాలకు మేం బాధ్యులం కాదు: ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం ప్రవర్తిస్తున్న తీరు సరికాదని, ఆయన ప్రవర్తనతో కాపు జాతికే నష్టం కలిగేలా ఉందని హోం మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. చట్టంలోని నిబంధనల మేరకు ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుందని వ్యాఖ్యానించిన ఆయన, ఎవరైనా దీక్షలు, రాస్తారోకోలు, పాదయాత్రలూ చేయదలిస్తే, ఆ వివరాలు పోలీసులకు తెలిపి, అనుమతి తీసుకోవడం తప్పనిసరని వివరించారు. తన పాదయాత్రకు అనుమతి తీసుకోబోనని ముద్రగడ చెప్పడం ఎంతమాత్రమూ పద్ధతిగా లేదని, ముందుగా చెప్పకుండా నిరసనలు చేపడితే, తదుపరి జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని చినరాజప్ప హెచ్చరించారు. ఆయన ఉద్యమించాలన్న సంకల్పం మంచిదేనని, ఆయన పట్టుదలకు పోకుండా అనుమతులు తీసుకోవాలని సూచించారు.