: మీరు లేకపోతే ఈ పాత్ర పోషించే దానిని కాదు: నైనా గంగూలీ
వంగవీటి సినిమాలో 'వంగవీటి రత్నకుమారి' పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని నైనా గంగూలీ తెలిపింది. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన 'వంగవీటి' ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, రాంగోపాల్ వర్మ లేకపోతే ఈ సినిమాలో నటించేదానిని కాదన్నారు. తనకు మంచి పాత్ర ఇచ్చి, తనను అందులో బాగా నటింపజేసిన రాంగోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో పాత్ర తనకు మంచి పేరు తెస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆమె అన్నారు.