: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసిన స‌చిన్ టెండూల్క‌ర్


నాయ‌క‌త్వ స‌ద‌స్సులో పాల్గొన‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కొద్దిసేప‌టి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును టీమిండియా మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ క‌లిశాడు. సుమారు 15 నిమిషాల పాటు ఆయ‌న‌తో చ‌ర్చించాడు. తాను ద‌త్త‌త తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ‌ గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులతో పాటు ప‌లు అంశాల‌పై చంద్ర‌బాబుకి స‌చిన్ టెండూల్క‌ర్ వివ‌రించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా క‌ల‌వ‌నున్నారు.

  • Loading...

More Telugu News