: పులిని చంపి వాగులో పాతిపెట్టిన దుండగులు
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పులిని చంపేసి ఆ తరువాత ఓ వాగులో దాన్ని పాతిపెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఈ రోజు ఉదయం ఘటనాస్థలికి చేరుకుని దుండగులు ఆ పులిని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించి, దాని కళేబరాన్ని బయటకు తీశారు. అనంతరం దానికి పోస్టుమార్టం నిర్వహించి, ప్రాణాలు కోల్పోయిన పులిని మూడేళ్ల మగపులిగా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.