: తొలిరాత్రి షాక్: భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, పారిపోయిన కొత్త పెళ్లికూతురు!


ఉత్తర్‌ప్రదేశ్‌, ఘజియాబాద్‌ జిల్లాలోని మోదీనగర్‌లో పెళ్లి జరిగి ఒక రోజయినా కాకముందే ఓ యువతి తన అత్తగారి ఇంట్లో నుంచి పారిపోయింది. మొదటి రాత్రి రోజున తన భర్తకు నీళ్లలో నిద్రమాత్రలు వేసి ఇచ్చి అనంతరం తన భర్త నిద్రలోకి జారుకోగానే నెమ్మదిగా నగదును తీసుకొని పరారైంది. నిన్న‌ ఉద‌యాన్నే విష‌యాన్ని గ‌మ‌నించిన కొత్త పెళ్లికొడుకు పంకజ్ త‌ల్లిదండ్రులు త‌మ కోడ‌లు ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో మొద‌ట‌ కంగారుపడ్డారు. మ‌రోవైపు, మంచంపై త‌మ కుమారుడు పంకజ్‌ స్పృహతప్పి పడిపోయి ఉండడాన్ని గమనించారు. త‌మ ఇంట్లో నుంచి రూ.77,000 నగదు, 175 గ్రాముల బంగారం కూడా మాయ‌మయ్యాయని తెలుసుకున్న పంకజ్ తల్లిదండ్రులు త‌మ కొత్త కోడ‌లే ఈ ప‌ని చేసి ఉంటుంద‌ని భావించి ఈ విష‌యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News