: ఆటోడ్రైవర్ల వేధింపులతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య
మృగాళ్ల వేధింపులు తట్టుకోలేక గౌతమి అనే ఓ విద్యార్థిని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్ల వేధింపులతోనే తమ కూతురు గౌతమి బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గౌతమి కేఎంఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లే క్రమంలోనే ఆటోడ్రైవర్ల వేధింపులకు గురయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.