: వచ్చిన విరాళాల్లో 40 శాతం నొక్కేసిన తీస్తా సెత్వలాడ్... పక్కా సాక్ష్యాలను సుప్రీంకోర్టుకు ఇచ్చిన పోలీసులు

గుజరాత్ అల్లర్ల బాధితుల కోసమని చెప్పి 2002 సంవత్సరంలో రూ. 10 కోట్ల విరాళాలను స్వీకరించిన తీస్తా సెత్వలాడ్, ఆమె భర్త 40 శాతం నిధులను స్వప్రయోజనాలకు వాడుకున్నారని గుజరాత్ పోలీసులు సుప్రీంకోర్టులో పక్కా సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. ఓ ఎన్జీవో సంస్థగా సేవలందిస్తున్నట్టు చెప్పుకుని రూ. 9.75 కోట్లను వసూలు చేసిన సంస్థ అందులో రూ. 3.85 కోట్లను వ్యక్తిగత వాడకానికి వినియోగించారని 83 పేజీల అఫిడవిట్ లో పోలీసులు తెలిపారు. కేసులో తీస్తా సెత్వలాడ్ తో పాటు ఆమె భర్త జావేద్ ఆనంద్, వారి ట్రస్టీలు, సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్, సబ్రాంగ్ తదితరులు నిందితులని పేర్కొంటూ పలు డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచారు. కాగా, గతంలో వీరిద్దరినీ అరెస్ట్ చేయకుండా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు, పూర్తి సాక్ష్యాలను తమ ముందు ఉంచాలని కోరిన నేపథ్యంలో గుజరాత్ పోలీసులు ఈ అఫిడవిట్ దాఖలు చేసి, వారి అరెస్టుకు మరోసారి అనుమతి కోరారు.

More Telugu News