: పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు.. దస్త్రంపై సంతకం చేసిన అరుణ్ జైట్లీ
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.2,991 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు సంతకం చేసినట్లు కేంద్ర జలవనరుల శాఖకు ఆర్థిక శాఖ అధికారులు సమాచారం అందించారు.