: పాకిస్థాన్ ను ట్రంప్ పొగడలేదట... 'ఇదంతా పాక్ ప్రచారమే' అంటూ కౌంటర్ ఇచ్చిన ట్రంప్ బృందం


పాకిస్థానీలు చాలా తెలివైనవారని, పాకిస్థాన్ ఓ అద్భుత దేశమని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కితాబిచ్చినట్టు పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అదంతా సొంత డబ్బానే అని తేలిపోయింది. పాక్ ప్రకటనకు డొనాల్డ్ ట్రంప్ అధికారిక బృందం కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధాని కార్యాలయం చేసిన ప్రకటన మొత్తం అలంకారాలు, అతిశయోక్తులతో నిండి ఉందని... పాకిస్థాన్ పై ట్రంప్ ఎలాంటి ప్రశంసలు కురిపించలేదని తేల్చిపారేసింది. అయితే, ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసుకునే విషయంపై మాత్రం ఇరువురి మధ్య మంచి చర్చ జరిగిందని తెలిపింది. ఓ విదేశీ అధినేతతో జరిగిన చర్చ పట్ల మళ్లీ ప్రకటన రూపంలో వివరణ ఇవ్వడం సాధారణంగా జరగదు. కానీ, పాక్ విషయంలో ఇలా జరగడం గమనార్హం. వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో... పాకిస్థాన్ ను ఓ ప్రమాదకరమైన దేశంగా ట్రంప్ అభివర్ణించారు. పాక్ ను నిరోధించగలిగేది ఒక్క భారత్ మాత్రమే అని అప్పట్లో చెప్పారు.

  • Loading...

More Telugu News