: రాహుల్‌ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌పై విచారణకు ఆదేశించిన టెలీ క‌మ్యూనికేష‌న్ల శాఖ


కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అందులో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు క‌నిపించాయి. అనంత‌రం రాహుల్ ఆఫీస్ సిబ్బంది వాటిని తొల‌గించారు. అయితే, ఈ అంశంపై ఈ రోజు ఉదయం ఢిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులకు కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఈ విష‌యంపై స్పందించిన టెలీ క‌మ్యూనికేష‌న్ల శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది. త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని ఢిల్లీ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట్ట‌ర్ ఖాతాలు కూడా హ్యాక్ కావ‌డ‌ంతో స‌దరు పార్టీనేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News