: అంతరిక్షం నుంచి నెటిజన్లకు పరీక్ష పెట్టిన వ్యోమగామి!
అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలపాటు విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన యురోపియన్ వ్యోమగామి థామస్ పెస్కెట్ ఓ పరీక్ష పెట్టాడు. సోషల్ మీడియాలో అనుసరించే నెటిజన్లను ఉద్దేశించి ‘నేను రాత్రి సమయంలో తీసిన ఫోటో ఇది. అంతరిక్షంలోంచి ఇది నేను తీసిన మొదటి ఫొటో. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇది భూమి మీదున్న ఏ నగరమో నాకు తెలియదు, మీకేమైనా తెలుసా?’ అంటూ రాత్రి సమయంలో వెలుగులీనుతున్న ఓ నగరం ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వెలుగులీనుతున్న ఆ నగరం పారిస్ అని చాలా మండి నెటిజన్లు పేర్కొన్నారు. తరువాత దానిని నిశితంగా పరిశీలించిన నెటిజన్లు అది భారతదేశ రాజధాని ఢిల్లీ అని, దానిని ఈశాన్యదిశగా తీశారని నిర్ధారించారు. దీంతో ఆ ఫోటోను పోస్టు చేసిన 12 గంటల తరువాత థామస్ పెస్కెట్ మరోసారి స్పందించి, 'నిజమే, అది ఢిల్లీ నగరమే. దీనిని గుర్తించడంలో సహాయం చేసినందుకు ధన్యవాదాలు' అంటూ మళ్లీ పోస్టు పెట్టారు. ఆ ఫోటో మీరు కూడా చూడండి.