: బాబు కోసం.. రష్యా యువకుడి 'మౌనపోరాటం'


రష్యాకు చెందిన యువకుడు 'మౌనపోరాటం' ప్రారంభించాడు. ఆ దేశానికి చెందిన అలెక్స్ కు 2012లో సనం ఉల్ హక్ అనే హైదరాబాదు యువతితో గోవాలో పరిచయమైంది. 2014లో వీరిద్దరూ వివాహం చేసుకుని, హైదరాబాదు శివారు ఆల్వాల్ లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో వారికి పండంటి బాబు పుట్టాడు. అనంతరం వీరిద్దరూ రష్యా వెళ్లిపోయారు. అక్కడ వీసా గడువు ముగియడంతో అలెక్స్ కు సమాచారం ఇవ్వకుండా సనం హైదరాబాదు వచ్చేసింది. దీంతో విషయం తెలియని అలెక్స్ తన కుమారుడు, భార్య కనిపించడం లేదంటూ రష్యాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె హైదరాబాదులో ఉందని తెలుసుకుని హైదరాబాదు వచ్చి ఆమెను రష్యా రావాలని కోరాడు. ఆమె వచ్చేందుకు అంగీకరించని పక్షంలో తన కుమారుడ్ని తనకు ఇచ్చేయాలని కోరాడు. దీంతో డబ్బులు ఇస్తేనే బాబును ఇస్తానని సనం స్పష్టం చేసింది. దీనిపై అలెక్స్ ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News