: నీకు తిరుగులేదు...నీ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు: తనకు తాను గ్రీటింగ్స్ చెప్పుకున్న ప్రియాంకా చోప్రా
16 ఏళ్ల క్రితం బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దానిని గుర్తు చేసుకున్న ప్రియాంక ట్విట్టర్ లో 'నీకు తిరుగులేదు, నీ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు...18 ఏళ్లు, ఏం చేస్తున్నానో కూడా సరిగ్గా తెలియని వయసు. ఆ ప్రయాణం మొత్తం అద్భుతంగా సాగింది' అని గతాన్ని గుర్తు చేసుకుంది. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన సందర్భంగా తీసిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిని ప్రియాంకా చోప్రా అభిమానులు ఆస్వాదిస్తున్నారు.