: నోట్ల రద్దు చేదు మాత్రే.. కానీ ఆరోగ్యవంతమైన ఫలితాలు వస్తాయి: రామ్‌దేవ్ బాబా
పెద్దనోట్ల రద్దు ప్రజలకు ఓ చేదుమాత్ర లాంటిదేనని, అయితే దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఆరోగ్యవంతమైన ప్రభావం చూపుతుందని ప్రముఖ యోగాగురు రామ్‌దేవ్ బాబా అన్నారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారత బంద్‌కు పిలుపు ఇచ్చినా ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు పలికారన్నారు. ప్రధాని సాహసోపేత నిర్ణయానికి ప్రజలు అండగా నిలిచారని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు.