: తెలంగాణ ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి ప్రారంభమైంది: నటుడు సుమన్


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిరాహారదీక్ష చేపట్టిన నవంబరు 29వ తేదీ సందర్భంగా ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద దీక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌ కళాకారులు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో అల‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సినీన‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం రాదని ఎంతో మంది అన్నారని.. అయితే, కేసీఆర్ ఆనాడు దీక్ష చేపట్టడంతో ప్ర‌జ‌ల క‌ల నెర‌వేరింద‌ని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడటంతో అక్క‌డ ఏపీలోనూ అభివృద్ధి ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జలేకాక ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా కేసీఆర్‌ను అభినందిస్తున్నారని అన్నారు. నవంబర్ 29ని సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. తాను ప్ర‌స్తుతం తెలంగాణ కథ ఇతివృత్తంగా తీస్తోన్న ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News